Srimukhi: క్షమాపణలు కోరిన శ్రీముఖి.. కారణం ఏమిటంటే..! 18 h ago
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు యాంకర్ గా చేసిన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో.. "రామ, లక్ష్మణుల ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మనం విన్నాం. కానీ సాక్షాత్తు ఇప్పుడు నా కళ్ళముందే కూర్చున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది". దీంతో అది కాస్త వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా లో పలువురు శ్రీముఖి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈనేపథ్యంలో క్షమాపణలు కోరుతూ శ్రీముఖి వీడియో షేర్ చేసింది.
వీడియో లో శ్రీముఖి మాట్లాడుతూ "ఈమధ్య నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్ లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నాను. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వాళ్ళ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లను మరోసారి జరగకుండా చూసుకుంటానని అందరికి మాటిస్తున్నాను. అలాగే మీ అందరిని క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్దమనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్న. జై శ్రీరామ్" అంటూ మాట్లాడింది.