Ticket Prices: డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ నిర్మాతలకు షాక్..! 1 d ago
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాల నిర్మాతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాల టికెట్ ధరలను 14 రోజుల వరకు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ టికెట్ రేట్ల పెంపు పై ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీంతో 14 రోజుల పాటు అధిక రేట్లు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి 10 రోజులకు పరిమితం చేస్తూ కోర్ట్ ఆదేశాలిచ్చింది.