Kannappa: "కన్నప్ప కామిక్ బుక్" ఎపిసోడ్ 1 రిలీజ్..! 8 h ago
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2989 ఏడీ మేకర్లు మూవీ రిలీజ్ కి ముందు కొన్ని యానిమేటెడ్ ఎపిసోడ్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నప్ప మూవీ మేకర్లు కూడా "కన్నప్ప కామిక్ బుక్" టైటిల్ తో ఓ యానిమేటెడ్ ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. భక్తి, శౌర్యం మరియు త్యాగం కలగలిసిన కథని యానిమేషన్ రూపంలో ఆస్వాదించండి అని పేర్కొన్నారు. ఇందులో శ్రీకాళహస్తి చరిత్ర, తిన్నడు బాల్యం గురించి వివరించారు.