Khushbhu: విశాల్ ఆరోగ్యం పై పూర్తి వివరణ ఇచ్చిన ఖుష్భూ..! 1 d ago
తమిళ్ హీరో విశాల్ ఆరోగ్యం పై నటి ఖుష్బూ తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో స్పష్టతనిచ్చారు. 'విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. 'మదగజరాజ' మూవీ 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుందని ఈవెంట్ కు వచ్చారు. ఆ సమయంలో అతనికి 103 డిగ్రీల జ్వరం తో వణికిపోయారు. ఈవెంట్ అనంతరం విశాల్ ని ఆసుపత్రికి తీసుకెళ్ళగా ఇప్పుడు కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాస్తున్నారు' అని ఖుష్భూ తెలిపారు.