Raja Saab: జపాన్ లో "రాజా సాబ్" ఈవెంట్..! 1 d ago
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం "ది రాజా సాబ్". ఈ మూవీ సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ని పంచుకున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ చేసిన అన్ని సినిమాలన్నీ రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో మాస్ సాంగ్స్, కమర్షియల్ సాంగ్స్ లేవు. రాజా సాబ్ కమెర్షియల్ సినిమా. ఇందులో కమెర్షియల్ సాంగ్, డ్యూయెట్ సాంగ్ , ఇంకా ఐటెం సాంగ్ అన్నీ ఉన్నాయి. జపాన్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం జపనీస్ వేరియేషన్లో ఒక పాట రెడీ చేసాం. అలాగే ఆడియో లాంచ్ ని జపాన్ లో చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఆల్బం కొత్తగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మూవీ లో మాస్ సాంగ్ రాబోతుంది' అని థమన్ తెలిపారు. థమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రభాస్ నుంచి మాస్ వస్తుంన్నందుకు అభిమానులు సోషల్ మీడియా లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్లు ప్రకటించినా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.