Salman Khan house: ఇంటికి బులెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్..! 1 d ago
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న సల్మాన్ తన భద్రత పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బులెట్ ప్రూఫ్ కార్ ను కొనుగోలు చేసిన సల్మాన్ తాజాగా తన ఇంటికి కూడా పూర్తిగా బులెట్ ప్రూఫ్ గ్లాస్ ఫిక్స్ చేపించుకుంటున్నారు. ఇద్దరు కార్మికులు సల్మాన్ ఇంటి బాల్కనీ కు బులెట్ ప్రూఫ్ గ్లాస్ అమరుస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇటీవల సల్మాన్ రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ఓ బులెట్ ప్రూఫ్ కార్ ను దుబాయ్ నుంచి దిగుమతి చేయించారని కూడా టాక్ నడుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సల్మాన్ కు 'వై' కేటగిరీ భద్రత కేటాయించిన విషయం తెలిసిందే.
సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ కు సంబంధం ఏంటంటే..
గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. అయితే, బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణ జింకలను పవిత్రంగా భావిస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన వారికీ నచ్చలేదు. ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. గత ఏడాది సల్మాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. తన తప్పు తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేశారు.