Singer Ramana Gogula: తన వ్యక్తిగత విషయాలను పంచుకున్న రమణ గోగుల..! 8 h ago
సింగర్ రమణ గోగుల దాదాపు 18 ఏళ్ల తర్వాత పాడిన "గోదారి గట్టు" పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. కాగా తనది ఒరిజినల్ గుండు కాదని, ఎప్పటికప్పుడు షేవ్ చేసుకుంటారని చెప్పారు. "జానీ మూవీ చేస్తున్న సమయంలో నా భార్య కడుపుతో ఉంది. డాక్టర్లు డెలివరీ కష్టం అని చెప్పారు. ఏంచేయాలో తోచక ఆఫీస్ లో డల్ గా కూర్చోని ఉన్నాను. ఆఫీస్ లో మా కీ బోర్డు ప్లేయర్ ఒకతను ఇది గమనించి ఏమైంది సార్ అని అడిగాడు. దీంతో అతనికి జరిగింది వివరించాను. అందుకు అతను నాతో తిరుపతి కి వెళ్ళిరండి సార్, అంతా సర్దుకుంటుంది అని చెప్పగా తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని అక్కడే నా తల నీలాలను దేవుడికి ఇచ్చి వచ్చాను. తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయ్యింది. ఇక అప్పడే డిసైడ్ అయ్యా జీవితంలో ఇక జుట్టు పెంచుకోకూడదని" అని రమణ గోగుల తెలిపారు.