Film Exhibitors Associations: ధరలు తక్కువ ఉంటేనే జనం వస్తారు-ఎగ్జిబిటర్లు 10 h ago
తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్ ప్రెస్‌మీట్ పెట్టారు. బెనిఫిట్ షోలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, టికెట్ ధరలపై నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నామని అన్నారు. సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని ఎగ్జిబిటర్లు చెప్పారు. టికెట్ ధరల వల్ల సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయని వివరించారు. ధరలు తక్కువ ఉంటేనే జనం వస్తారని, ఏపీలోనూ ఇదే నిర్ణయాన్ని తీసుకోవాలని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.