UI Movie OTT: ఓటీటీ..క్లారిటీ ఇచ్చిన మేకర్లు..! 1 d ago
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ "UI". ఇటీవల ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు, త్వరలోనే ఈ మూవీ అందులో స్ట్రీమ్ కానున్నట్లు పలు రూమర్స్ వచ్చాయి. దీంతో తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ లహరి ఫిల్మ్స్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తమ సినిమా 'UI' పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఏదైనా ఉంటే తామే అనౌన్స్ చేస్తామని స్పష్టం చేశారు.