Mohan babu: నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్..! 1 d ago
నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వాడొద్దని ఆదేశించింది. తన వ్యక్తిగత హక్కుల్ని రక్షించాలని కోరుతూ మోహన్‌బాబు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. కోర్టు అనుమతి లేకుండా మోహన్‌బాబుకు సంబంధించినవేవీ వాడరాదని, ఆయన కంటెంట్‌ను గూగుల్ తొలగించాలని స్పష్టం చేసింది.