Amaravati: అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం..! 25 d ago
అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(AI) లాంటి నూతన సాంకేతికతల పైనే ఆధారపడుతుందన్నారు. హైదరాబాదులో ఐటీ ని ప్రమోట్ చేసినందుకు హైటెక్ సిటీని నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీ తో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకాన్ కి భవనం ఉండాలని సూచించారు.