Droupadi Murmu : రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం..! 26 d ago
ఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ రాజ్యాంగ వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథమని అన్నారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం అమోదం పొందిందని గుర్తు చేసారు. ప్రజాస్వామ్యం, గణతంత్ర ఆధారంగా రాజ్యాంగం రూపకల్పన జరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.