YS Jagan: రాష్ట్రంలో స్కాంల పాలన నడుస్తుంది..! 24 d ago
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. హామీల అమలు లేకపోగా స్కాంలో పాలన నడుస్తుందని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక క మార్పులు తీసుకొచ్చామని, ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ తో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ తో భరోసా ఇవ్వలేకపొగా..లిక్కర్, ఇసుక స్కామ్ లతోపాటు పేకాట క్లబ్ లు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.