Komati reddy: పెండింగ్ పనులు, కొత్తప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చ..! 26 d ago
TG : జాతీయ రహదారుల అంశంపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. పెండింగ్ పనులు, కొత్తప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చిననున్నారు. అధికారులపై మంత్రి ఆగ్రహించారు. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పంటల సీజన్ మొదలైతే భూసేకరణ అసాధ్యమన్నారు. ఏళ్లు గడిచినా మన్నెగూడ రోడ్ పనులు ప్రారంభించలేదన్నారు. వచ్చేవారమే పనులు ప్రారంభించాలని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం..కాంట్రాక్టర్ల కోసం కాదన్నారు. ఖమ్మం జిల్లాలో 400 అర్బిట్రేషన్ కేసులు పెండింగ్ ఉన్నాయి, సీఎంతో సమీక్షించే నాటికి పనుల్లో పురోగతి ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.